సువార్తలు అనగా ఏమిటి?

సువార్తల స్వభావాన్ని అర్థం చేసుకొనడానికి ఈ క్రింద ఇవ్వబడిన వివరాలు ముస్లింలకు సహాయపడతాయని భావిస్తున్నాము.  

బైబిలులోని నాలుగు సువార్తలు కూడా యేసుక్రీస్తు ప్రభువారి జీవితం గురించిన "అహాదీత్ అస్సహీహ" (the correct traditions).

ఏ న్యాయస్థానంలోనైనా ఒక విషయాన్ని గూర్చిన సత్యాసత్యాలను ఋజువు చేయడానికి కనీసం ఇద్దరు సాక్షులైనా అవసరం కదా! యేసుక్రీస్తు ప్రభువారి జీవితము మరియు వారి బోధనల గురించి సాక్ష్యమిచ్చుటకు మూడు సంక్షిప్త (సినోప్టిక్) సువార్తలు మనకు ఉన్నాయి. అవి ఏవనగా, మత్తయి, మార్కు మరియు లూకా సువార్తలు. యోహాను వ్రాసిన సువార్త (ఇంజీల్ యుహన్నా)లో యేసుక్రీస్తు ప్రభువారిలోని అంతరంగ రహస్యాలు (అల్-అస్రార్) ప్రతి విశ్వాసి కొరకు పొందుపరచబడి ఉన్నాయి.

యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు యూదుల విశ్రాంతి దినాల గురించి బోధించినది, పరిశుద్ధాత్మ రాకడ గురించి మరియు తన పునరుత్థానమును గురించి బోధించిన విషయాలను యోహాను వ్రాశాడు.

ప్రతి సువార్తకు ఒక ఉద్దేశ్యము ఉంది. యేసుక్రీస్తు ప్రభువే నిజమైన సువార్తయై యుండగా, ఆయన గురించి వ్రాయబడిన నిజసాక్ష్యాలే ఈ నాలుగు సువార్తలు. వీటిని ‘‘అల్-ఇంజీల్-అస్సహీహ్’’ అని మనము అనవచ్చు.  

ఆంగ్ల మూలం :- What are the Gospels?


పరిశుద్ధ గ్రంథము
ఆన్సరింగ్ ఇస్లాం తెలుగు