బిషప్పు జాన్ సుభాన్ గారి సాక్ష్యము

        సుభాన్ మెథడిస్టు బిషప్పుగా పదవి స్వీకరించక ముందు ముహమ్మదీయ మతములోని సూఫీ తెగకు చెందినవాడై యజకత్వము కొరకు సిద్దపడుచుండెను. అతడు చదువుచున్న పాఠశాలలోని గురువులు క్రైస్తవ మతముపై దాడులు జరుపుచుండుట సామాన్య విషయముగా ఉండెడిది. ఒక దినము సుభాన్ తన తరగతి ముగించుకొని యింటికి వెళ్ళే సమయంలో ఉండగా, నలపబడిన ఒక కాగితము అతని కాళ్ళ దగరకు వచ్చి పడింది. అది మత్తయి సువార్తలోని ప్రభువు మరణము, సిలువ శ్రమలకు సంబంధించినది.

        "నా దేవా! నా దేవా! నన్నెందుకు చేయి విడిచితివి" (మత్తయి 27:46) అనే ఈ వాక్యములు పదే పదే సుభాన్ చదువసాగెను.

        ఈ మాటాలు సుభాన్‍ని ఎంతో ఆశ్చర్యచకితుని చేసినవి. "యేసు ప్రభువు నిజంగా సిలువ వేయబడలేదు కాని క్రీస్తు స్వారుప్యము ఇస్కరియోతు యూదా మీద పడినది; క్రీస్తు కాదు యూదాయే సిలువ మీద వ్రే్లాడబడ్డాడు. సిలువ వేయక ముందే క్రీస్తు ఆరోహణమయ్యారు". ఈ విషయాలే సుభాన్ అప్పటివరకు ఆ పాఠశాలలో నేర్చుకొన్నవి.

        ఈ ఒకే ఒక్క వాక్యాన్ని సుభాన్ పదే పదే చదవసాగాడు. "ఈ మాటలు యూదావి కావు" అని తనలో తానే అనుకొన్నాడు. దేవుడు తనను ఎందుకు విడిచిపెట్టాడో చెడ్డవాడైన యూదాకి తెలిసేఉంటుంది! చెడ్డవాని మాటలు కావవి. ఒక మంచి వ్యక్తి మాటలవి."నా దేవా! నా దేవా! నన్నెందుకు  చెయ్యి విడిచితివి" అని కేవలం ఒక మంచి వ్యక్తి మాత్రమే చెప్పగలడు. అకస్మాత్తుగా సుభాన్‍కి ఒకటి స్ఫురించినది. క్రీస్తు ప్రభువే సిలువ పై మరణించినవారు, యూదా కానే కాదు. యేసు ప్రభువుని తన రక్షకునిగా స్వీకరించాడు. సుభాన్ ఈ అనుభవాన్ని ముస్లిం పాఠశాలలోని తన తోటి విద్యార్థులతో పంచుకున్నాడు. ఒక దినము తన తరగతిలోని అధ్యాపకుడు  క్రైస్తవులపై తన బోధనలతో దాడి జరుపుచుండగా, ఒక విద్యార్థి తన చేతిని పైకెత్తాడు.

"మన తరగతిలో ఒక క్రైస్తవుడున్నాడు" అని ఆ విద్యార్థి పైకి అనేశాడు.
"ఎవరతను?"  అధ్యాపకుని స్వరము కఠినంగా వినబడింది. ఆ విద్యార్థి సుభాన్ వైపు చేయి చూపుతూ ఈ సుభానే క్రైస్తవుడు అని చెప్పాడు.
"సుభాన్ నీవు క్రైస్తవుడివా?" అన్న అద్యాపకుని ప్రశ్నకి "యేసు ప్రభువు నా కొరకు సిలువపై మరణించారని నేను నమ్ముచున్నాను" అని సుభాన్ సమాధానం చెప్పాడు.
ఈ మాటకి అధ్యాపకుడు మండిపడ్డాడు. వెంటనే తరగతి గదిని బహిష్కరించి నేరుగా ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్ళాడు. ప్రిన్సిపాల్ వెంటనే తన కార్యనిర్వాహకులను సమవేశపర్చాడు. దానికి సుభాన్‍ని హజరు కమ్మని ఆదేశించాడు. సుభాన్ చిన్న వయసులో ఉన్న క్రైస్తవుడైనప్పటికీ మానవ జ్ఞానాన్ని మించిన జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అతనికి అనుగ్రహించెను. అతని నోటినుండి వచ్చిన సమాధానాలు అతనినే ఆశ్చర్యపరచినవి. సుభాన్ చేసిన ఈ చర్యనుబట్టి తరగతుల నుండి ఇతనిని బహిష్కరించారు. ప్రభువు కొరకు తాను పొందిన ఈ శ్రమ తనకు చెప్పరాని ఆనందాన్ని చేకుర్చింది.
        
        తర్వాత క్రైస్తవ సేవకు తగిన విద్యను అభ్యసించుట ప్రారంభించెను. మొదటి సారి అతను చేరిన కళాశాల అతనికి అంత తృప్తినివ్వలేదు, ఎందుకనగా తాను ఎరిగినంత లేఖనముల సత్యము కూడా అందులో లేదు. తర్వాత రోమను క్యాథలిక్కుల కళాశాలలో ప్రవేశించెను. ఆ కళాశాలలోనివారు పరిశుద్ధ గ్రంథముతో భేటీ పడలేదు కాని పూర్తిగా దానిని నిర్లక్ష్యపరిచారు. సుభాన్ దీనిని కూడ విడిచిపెట్టి చివరికి సువార్తను కేంద్ర బిందువుగా, లేఖనాలకు ప్రాముఖ్యతనిచ్చే కళాశాలలో చేరాడు. తర్వాతి కాలంలో హిందుదేశంలోని మెథడిస్టు సంఘానికి బిషప్‍గా నియమింపబడ్డాడు.

సుభాన్ యొక్క జీవిత చరిత్రను సమగ్రంగా చదవాలంటే ఆంగ్లంలో ఇక్కడ చదవగలరు - How a Sufi found his Lord.


వారెందుకు మారారు?

ఆన్సరింగ్ ఇస్లాం తెలుగు